ఈ ఫోటోలో ఉన్న అమ్మ‌యి ఓ స్టార్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తుపడ్డితే మీరు జీనియ‌స్‌..!!

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమ అభిమాన నటుల గురించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆ విషయాన్ని చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. సెలబ్రిటీల అంశాలు ఏదైనా సరే, భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ చిన్న పాప ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది.

ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు సూపర్ స్టార్ గా మారి, సీనియర్ హీరోయిన్ హోదా కూడా అందుకుంది. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల్లో నటించింది. ఇక 80ల్లోనే వెంకటేష్ హీరోగా నటించిన ” కలయుగ పాండవులు” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది.

 

తెలుగులోనే కాదు తమిళ్ తదితర భాషల్లో కలిపి వందల సినిమాల్లో నటించింది. అంతే కాదు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంది. రెండు రంగాల్లోనూ సత్తా చూపిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు.. ఖుష్బూ సుందర్. వెంకటేష్ తో జతకట్టి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత తమిళ్‌లో సూప‌ర్ స్టార్ అయింది. తొలిసారి ఓ హీరోయిన్‌కు గుడి కట్టే అంత అభిమానం సంపాదించుకుంది.