దేవర సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్.. ఇదే సినిమాకు హైలెట్..!!

ఎన్టీఆర్ RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. దీంతో సినిమాల పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ..ఈ సినిమా పైన కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు

Devara First Look Out! Jr NTR Looks Raw, Intense & Tough Man Who Is On A  Mission

సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల శివ ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఈ సినిమాతో తిరిగి తను ట్రాక్ లొకి రావాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాతో ఎన్టీఆర్ కూడా మరొక హిట్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల పోస్టర్లు సైతం వైరల్ గా మారాయి.. తాజాగా దేవర సినిమాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో అండర్ వాటర్ పైట్ ఉండబోతుందని ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ అండర్ వాటర్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం.మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారు.