నానిపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు చూడు అదే అంటాడట‌!

సీతారామం మూవీతో టాలీవుడ్ లో ఓవ‌ర్ నైట స్టార్ అయిన అందాల భామ మృణ‌ల్ ఠాకూర్.. ప్ర‌స్తుతం తెలుగులో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారింది. మృణాల్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగ‌మైంది. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ `VD14` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి న్యాచుర‌ల్ స్టార్ నాని `హాయ్ నాన్న‌`. ఈ మూవీ ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మృణాల్ నాని గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అత‌ను ఎలాంటి వాడో గుట్టు విప్పింది.

నాని బెస్ట్ కోస్టార్ అని.. అలాగే ఆయ‌న చాలా సింపుల్ గా ఉంటార‌ని మృణాల్ పేర్కొంది. కెరీర్‌ అంటే పరుగుపందెం కాదని, అందరికంటే ముందుండాలనే కోరిక వల్ల మనశ్శాంతి కోల్పోతామని నాని ఎప్పుడూ చెబుతుంటారు.. అది త‌న‌కు బాగా న‌చ్చిదంటూ మృణాల్ తెలిపింది. ఇక సీతారామం చిత్రం తన కెరీర్‌లో మైలురాయి వంటిదని.. ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్ట‌ర్‌ హను రాఘవపూడికి లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాన‌ని మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.