రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాల‌య్య ఓపెన్ కామెంట్స్‌!

రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స్కంద‌`. ఇందులో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది.

చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సంద‌డి చేశారు. అలాగే స్పెష‌ల్ గెస్ట్ గా వ‌చ్చిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. స్టేజ్ పై హీరో రామ్ తో ఓ ఆట ఆడుకున్నాడు. రామ్ ను త‌మ్ముడు అని పిలుస్తూ.. బాల‌య్య అదిరిపోయేలా స్పీచ్ ఇచ్చారు. `రామ్‌కి మహా తిక్క. 2006లో అత‌డి జర్నీ ప్రారంభమైంది. మొదటి సినిమాకి నేను గెస్ట్ గా వెళ్లాను. ఇన్నేళ్ల‌ జర్నీలో రామ్‌ ఎన్నో రకాల సినిమాలు చేశాడు. మ‌రెన్నో భిన్నమైన పాత్రలు పోషించాడు.

ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ వస్తున్నాడు. కళామతల్లి మనకు ఇచ్చిన వరం రామ్‌. గర్వించదగ్గ నటుడు. ఇక తెలంగాణ యాస, భాషలో ఇస్మార్ట్ శంకర్ తీసి రామ్‌ నాకూ సవాల్ విసిరారు. నేను భగవంత్ కేసరితో తెలంగాణలో దిగుతున్నాను. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్2 లో మళ్లీ రాబోతుండటం సంతోషం. ఈ విషయంలో అత‌నిది పీహెచ్‌డీ అయిపోయింది. నేనింకా డిగ్రీనే చేస్తున్నారు. నేను రామ్ ను ఫాలో అవుతున్నాను` అంటూ బాల‌య్య చెప్పుకొచ్చారు. దాంతో వెంట‌నే రామ్ మైక్ అందుకుని `నేను చదివే స్కూల్‌లో మీరే హెడ్‌ మాస్టర్‌` అంటూ బాల‌య్య‌ను ఖుషి చేశాడు. ఆపై బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌ను, శ్రీ‌లీల‌, థ‌మ‌న్ ఇలా అంద‌రి గురించి మాట్లాడారు. మొత్తానికి బాలయ్య రాక‌తో స్కంద‌కు మ‌రింత హైప్ క్రియేట్ అయింది.