దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!

డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది..

Devara new update out! Jr NTR resumes shoot of Koratala Siva's film - India  Today

అదేమిటంటే ఈ సినిమా VFX వర్క్ ను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను విడివిడిగా కొంతమంది విఎఫ్ ఎక్స్ టీంకు పంపించినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో రూ .100 కోట్ల రూపాయలు కేవలం విఎఫ్ఎక్స్ వరకు కోసమే ఖర్చు చేయబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతున్నట్లు సమాచారం.

హైదరాబాదులో భారీ సెట్స్ వేసి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. గతంలో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఎలక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్న దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.