స్టేజ్ పైనే శ్రీ‌లీల‌కు వార్నింగ్ ఇచ్చిన బోయ‌పాటి.. అంత త‌ప్పు ఏం చేసిందంటే?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను వార్నింగ్ ఇచ్చారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `స్కంద‌`. ఇందులో రామ్ పోతినేని, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి.

శ‌నివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేశారు. మ‌రోవైపు శ్రీ‌లీల వైట్ క‌ల‌ర్ హాఫ్ శారీలో బ్యూటీఫుల్ గా మెరిసిపోయింది. ఈవెంట్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఇక‌పోతే ఈ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ.. మొద‌ట‌ గెస్ట్ గా వ‌చ్చిన బాల‌య్య గురించి గొప్ప‌గా మాట్లాడాడు. అలాగే రామ్ డెడికేష‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశాడు.

ఈ క్ర‌మంలోనే శ్రీ‌లీల గురించి చెబుతూ.. `ఆమె ప్ర‌స్తావ‌న రాగానే గ్లామర్ అని అంటున్నారు.. కానీ, శ్రీ‌లీల పరిపూర్ణమైన ఆర్టిస్ట్. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతాం. శ్రీలీల కనిపిస్తే మాత్రం ఏ హీరోతో చెయ్యట్లేదు అని అడగాల్సి వస్తోంది. ఆమె డేట్స్ దొర‌క‌డం కూడా చాలా క‌ష్ట‌మైపోతోంది. ఇలాగే ముందుకెళ్లు కాకపోతే మరీ ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్తగా వెళ్లు` అంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో బోయ‌పాటి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.