అఖండ 2 మూవీపై బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్..!

నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు పోటీగా కలెక్షన్లు వసూలు చేస్తున్న బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, యంగ్ హీరోయిన్‌ శ్రీ లీల, స్టార్ హీరోయిన్ కాజల్, పవర్ ఫుల్ హీరో బాలకృష్ణ నటించిన సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై హరీష్ పెద్ది, సాహూ గరికపాటి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్క‌ర్, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే బోయపాటి శ్రీను తాజాగా రామ్ స్కంద సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్యను మెయిన్ గెస్ట్ గా పిలిచారు. ఇందులో భాగంగా బోయపాటి మాట్లాడుతూ అఖండా 2 సినిమాపై కొన్ని సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖండ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల‌య్య కెరీర్‌లోనే భారీ కలెక్షన్స్ వ‌సూలు చేసి బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచిన సినిమాల్లో అఖండ ఒకటి.

కాగా బోయపాటి అఖండ 2 పై స్పందిస్తూ అఖండ సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలిసిన విషయమే. ఇక దీనికి సీక్వెల్ గా వస్తున్న రెండో పార్ట్ ఇంకో రేంజ్ లో ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ స్కంద తర్వాత నేను చేయబోయే సినిమా అఖండ 2నే అని ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వివరించాడు. ఇక బోయపాటి చేసిన ఈ కామెంట్స్ తో అఖండా 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.