టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటు కెరీర్ తో పాటు అటు పర్సనల్ లైఫ్ ను కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. సుధీర్గ కాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయింది.
గత ఏడాది ఆరంభంలో కాజల్ కు పండంటి మగబిడ్డ జన్మించగా.. కుమారుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెట్టి మునుపటి రూపంలోకి మారిన కాజల్.. మళ్లీ హీరోయిన్ గా బిజీ అయింది. తెలుగు, తమిళ భాషల్లో పలు ప్రాజెక్ట్‌లను టేకప్ చేసింది. అయితే పెళ్లైన వెంటనే కాజల్ బిడ్డను కనేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే త్వరగా బిడ్డను కనడం వెనక పెద్ద కథే ఉందట.
ఇటీవల రోజుల్లో సినీ తారలు పెళ్లి అయిన వెంటనే పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. నాలుగైదు ఏళ్లు ఫుల్ గా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లైఫ్ బోర్ కొట్టినా లేదా మనస్పర్థలు వచ్చి ఏవైనా గొడవలు జరిగినా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి తనకు రాకూడదని భావించే కాజల్ వెంటనే ప్రెగ్నెంట్ అయిందట. పుట్టే బిడ్డ తమ బంధాన్ని మరింత బలపరుస్తుందని కాజల్, గౌతమ్ భావించారట. అందుకే పెళ్లి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారని తెలుస్తోంది.