స్టార్ కపుల్స్ ని టార్గెట్ చేసిన త్రివిక్రమ్ .. మధ్య లో బన్నీ అడ్డంగా ఇరుక్కునేసాడే..?!

ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ తోనే సినిమాలు తీస్తాడు అంటూ ఇన్నాళ్లు ట్రోల్ చేసిన త్రివిక్రమ్ ని.. ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమాలో చేస్తున్నాడా..? అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు . మనకు తెలిసిందే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చిన్న హీరోలతో సినిమా చేయడు. ఆ రీజన్ ఏంటో ఆయనకే తెలియాలి. అయితే ఇదే పాయింట్ క్యాచ్ చేసుకున్న కొందరు ఆకతాయిలు ..త్రివిక్రమ్ ని ఏకిపారేస్తున్నారు .

పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో మూవీకి ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్ . ఈ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నాడు అంటూ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ స్టోరీ మొత్తం ఓ భార్యాభర్తల డివోర్స్ కి సంబంధించిన ఇష్యూ పైనే రన్ అవుతుందట .

అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ కపుల్ గా ఉన్న భార్యాభర్తలు విడాకులపై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఓ న్యూస్ ఇన్సైడ్ నుంచి వైరల్ గా మారింది . అయితే బన్నీ కథను వద్దు వద్దు అంటున్నా కానీ త్రివిక్రమే ఓకే చేయించాడట . ఈ క్రమంలోనే బన్నీ త్రివిక్రమ్ మాటలు విని మునిగిపోబోతున్నాడు అని అనవసరంగా కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేస్తున్నాడు అని సదరు హీరో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!