మీకు తెలుసా? మెగాస్టార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందట?

తెలుగు పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలా మెగా వృక్షం నుండి వచ్చిన హీరోలంతా సక్సెస్ సాధించారు. అయితే మెగా హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నాగబాబు కూతురు నిహారిక అని చెప్పుకోవచ్చు. నిహారిక మొదట యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి నటన పరంగా మంచి మార్కులు పడినా ఎందుకనో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అయితే దానికి కారణం ఆయా సినిమాలు హిట్ కాకపోవడమే మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆమె నిర్మాతగా కూడా మారింది. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఇదే విధంగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె చిరు సినిమాలకు డిజైనర్ గా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేసిందని చాలా మందికి తెలియదు. అవును, సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించుకున్నారట. అయితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సుస్మిత, ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా ప్రారంభం అయింది కూడా. ఫస్ట్ అఫ్ షూటింగ్ పూర్తి అయ్యాక సెకండ్ ఆఫ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.