పెళ్ళికి ముందు..పెళ్ళి తరువాత..సూపర్ స్టార్ కృష్ణ కి విజయనిర్మల పెట్టిన ఏకైక కండిషన్ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే విజయనిర్మల – కృష్ణ గారి జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది . అనారోగ్య కారణంగా విజయనిర్మల మరణిస్తే ఆమె మరణించిన కొద్ది కాలానికి కృష్ణ మరణించారు. కాగా వీళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే విజయనిర్మల చాలా మొండి ఆవిడ. ఆమె అనుకునేది సాధించే వరకు నిద్రపోదు . సినిమాల విషయంలో.. నిర్మాణం విషయంలో.. డైరెక్షన్ విషయంలో అందుకే సక్సెస్ అయింది.

 

అయితే విజయనిర్మల నటించిన దేవదాస్ సినిమా చూసి హీరోయిన్ వాణిశ్రీ వెటకారంగా కౌంటర్ వేయడంతో ..ఆమె మరణించే వరకు కూడా మాట్లాడలేదు విజయనిర్మల. ఆమె నటించిన దేవదాస్ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది .అయితే ఇదే టైంలో వాణిశ్రీ -రమ ప్రభాతో మాట్లాడుతూ..” ఏఎన్ఆర్ నటించిన దేవదాస్ సినిమా రిలీజ్ చేస్తే ఇప్పటికీ వంద రోజులు ఆడుతుందని ..అదే విజయనిర్మల నటించిన దేవదాస్ సినిమా రిలీజ్ చేస్తే హాల్లో సినిమా చూడడానికి దోమలు తప్ప మనుషులు ఉండడం లేదని వెటకారంగా కౌంటర్ వేసింది”.

దీంత్ఫ్ విజయ్ నిర్మలకు కోపం వచ్చింది . అంతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విజయనిర్నల ఎడాపెడా తిట్టేసింది . అంతేకాదు ఆమె మరణించే వరకు కూడా మాట్లాడలేదట . అంతేకాదు కృష్ణ ని సైతం వాణిశ్రీ తో నటించవద్దని తెగేసి చెప్పిందట. అయితే 15 , 16 సంవత్సరాల తర్వాత దర్శక నిర్మాతలు ఒత్తిడి కారణంగా ఓ సినిమాలు నటించే అవకాశం వచ్చినా విజయ్ నిర్మల రచ్చ రంబోలా చేసి సెట్స్ నుంచి కృష్ణ తీసుకెళ్ళిపోయింది. దీంతో ఈ సినిమాలో హీరో సుమన్ ని పెట్టి తెరకెక్కించారు మేకర్స్. అంత మొండి కలది విజయ్ నిర్మల ..తాను అనుకున్నది ఎలాగైనా సాధిస్తారు..!!