బన్నీతో నటించడం అంత దురదృష్టమా.. ఈ హీరోయిన్ల పరిస్థితి ఏమైందంటే..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతనితో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు . అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మారిపోతుందని భావించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటిది కొంతమంది హీరోయిన్ల కెరీర్ మాత్రం అల్లు అర్జున్ తో నటించడం వల్లనే నాశనమైంది అంటూ ఇటీవల సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్ తమ మొదటి సినిమా అల్లు అర్జున్ తో కలిసి నటించామ్ అని సంతోషించారు కానీ వారి సినీ కేరిర్ లో ఏ మాత్రం సక్సెస్ లేక  ఇండస్ట్రీ కి దూరమయ్యారట.

మరి అల్లు అర్జున్ కారణంగా కెరీర్ క్లోజ్ చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ‘వరుడు ‘ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులు పరిచయమైన భాను శ్రీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో భాను శ్రీ తన అందచందాలతో,నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తన మొదటి సినిమా నే సక్సెస్ అవ్వకపోవడంతో ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో భాను శ్రీ ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయింది.

ఇక అల్లు అర్జున్, గౌరీముంజల్ కలిసి నటించిన ‘బన్నీ ‘ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ అమ్మడు నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ గౌరీ కి మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరమై ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపార రంగంలో స్థిరపడింది. ప్రస్తుతం ఈమె కి 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

ఆ తర్వాత అల్లు అర్జున్,అను మెహత కాంబినేషన్ లో వచ్చిన’ ఆర్య ‘సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన అను మెహత ‘ఆర్య’ సినిమా తరువాత ఒక రెండు మూడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో అను మెహతా కూడా ఇండస్ట్రీకి దూరమైంది. ఇలా తమ మొదటి సినిమాని అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో మొదలుపెట్టామని ఆనందపడిన హీరోయిన్స్ ని పూర్తిగా ఇండస్ట్రీ కి దూరం చేసింది.