ప‌ది రోజుల్లో రూ. 60 కోట్లు.. ఇంత‌కీ `బేబీ` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో నాగ‌బాబు, లిరీషా, హర్ష చెముడు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది.

విడుద‌లైన నాటి నుంచి ప్ర‌తి రోజు రూ. 2 కోట్లు త‌గ్గ‌కుండా వ‌సూళ్ల‌ను అందుకుంటోంది. ప‌ది రోజుల బాక్సాఫీన్ ర‌న్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 27.85 కోట్ల షేర్‌, రూ. 51.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అంఉకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 31.71 కోట్ల షేర్ రూ. 60.40 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను ద‌క్కించుకుంది. ఇంకా ఈ ఫిగ‌ర్ పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక‌పోతే డిజిట‌ల్‌ ప్రియులు బేబీ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా బేబీ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. అయితే బేబీ బాక్సాఫీస్ ర‌న్ స‌క్సెస్ ఫుల్ గా కొన‌సాగుతున్న నేప‌థ్యంలోనే.. ఈ సినిమా ఓటీటీలోకి రావ‌డానికి మ‌రికొద్ది రోజులు స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఆగ‌స్టు ఆఖ‌రి వారంలో లేదా సెప్టెంబర్ మెుదటి వారంలో బేబీ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.