నా కూతురు నాలా మాత్రం కాకూడ‌దు.. హాట్ టాపిక్ గా అలియా భ‌ట్ కామెంట్స్‌!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో అలియా భ‌ట్ ఒక‌టి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ అందాల సోయ‌గం.. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ ప్రేయ‌సిగా సీత పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అలాగే కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఏడడుగులు వేసింది.

ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. అలియా భ‌ట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. వివాహం జ‌రిగిన ఏడు నెల‌ల‌కే పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. త‌మ ముద్దుల కూతురుకు అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ దంప‌తులు `రాహా` అంటూ నామ‌క‌ర‌ణం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ భేటీగా కూతురు కూడా అలియా భ‌ట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. `సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో నీ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిద్రమానుకుని ఏకధాటిగా సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం నా కుటుంబం కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా.

అలా అని సినిమాల‌ను వ‌దిలిపెట్ట‌ను. ఇక‌ నా కూతురు రాహా నాలా మాత్రం కాకూడ‌దు. నా అడుగు జాడ‌ల్లో న‌డ‌వ‌కూడ‌దు. ఆమె బాగా చదువుకుని గొప్ప పరిశోధనలు చేసే సైంటిస్ట్‌ కావాలన్నది నా కోరిక‌` అంటూ అలియా భ‌ట్ చెప్పుకొచ్చింది. ఈమె వ్యాఖ్య‌లు ఫ్యాన్స్ ను కాస్త నిరాశ ప‌రిచాయి. అలియా బాట‌లోనే ఆమె కూతురు కూడా సినిమాల్లోకి రావాల‌న్న‌ది ఫ్యాన్స్ కోరిక. రాహా పుట్టిన‌ప్పుడే జూనియ‌ల్ అలియా భ‌ట్ అంటూ చ‌ర్చించుకున్నారు. కానీ, ఇప్పుడు అలియా భ‌ట్ మాత్రం నా కూతురు సినిమాల్లోకి రాకూడ‌దు అంటూ కామెంట్లు చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.