బిజీ అయిపోయిన సీతారామం హీరోయిన్..సినిమాల లిస్ట్ ఇదే

కొంత మంది హీరోయిన్ లు గుర్తుండిపోవాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చాలు. ఆ ఒక్క సినిమాలో చేసిన క్యారెక్టర్ ఆ హీరోయిన్ ను స్టార్ హీరోయిన్ ని చేస్తుంది. ఆ తరువాత ఆ హీరోయిన్ బిజీ అయిపోవడం మాములు విషయమే. దర్శకులు, నిర్మాతల కళ్ళు అన్ని ఆ హీరోయిన్ మీదే ఉంటాయి. తాజాగా ఒక హీరోయిన్ ఇలానే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయింది. ఆమెనే మృణాల్ ఠాకూర్. ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరికి గుర్తుండిపోయింది. ముఖ్యంగా తన కళ్ళు, నటనతో అందరిని కట్టిపడేసింది. తన మాటలు, డైలాగ్ లు సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా మంచి కలెక్షన్స్ ని తెచ్చాయి. దీంతో మృణాల్ ఠాకూర్ కి మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి. వరుస సినిమాలతో మృణాల్ ఠాకూర్ బిజీ అయిపోయింది.

ఇప్పుడు మృణాల్ ఠాకూర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఒకటి న్యాచురల్ స్టార్ నానితో నాని 30 లో నటిస్తుండగా, తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం మరో సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటిస్తుంది. ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే థియేటర్ లలో సందడి చేయనున్నాయి. అయితే తాజాగా విడుదలైన లస్ట్ స్టోరీస్ లో కూడా మృణాల్ ఠాకూర్ నటించింది. నానితో చేస్తున్న సినిమా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న విడుదల కానుంది. విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా కూడా తక్కువ గ్యాప్ లోనే వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగులో మృణాల్ ఠాకూర్ కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగులో శ్రీలీల వరుస సినిమాలతో బిజీ ఉంది. మృణాల్ ఠాకూర్ చేసే ఈ రెండు సినిమాలు హిట్ అయితే మృణాల్ ఠాకూర్ కూడా తెలుగులో బిజీ అవుతుంది.