ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీలకమైన పాత్రలలో అమితాబచ్చన్ ,దిశా పటాన్ని నటిస్తూ ఉన్నారు. అలాగే కమలహాసన్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అరుదైన గౌరవాన్ని అందుకుంటోంది.

Project K: Prabhas, Deepika Padukone-starrer gets new poster, release date  - Hindustan Times

గత కొద్దిరోజులుగా ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ ని జూలై 20 తేదీన రివిల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.. శాన్ డియాగో కామిక్- ఖాన్ వేడుకలలో ఈ ఫస్ట్ గ్లింపును టైటిల్ తో పాటు విడుదల తేదీని కూడా రివిల్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకోలేదని తెలుస్తోంది. అమెరికాలో ఈనెల 19వ తేదీన ఈ వేడుకలు మొదలు కాబోతున్నాయి

జులై 20వ తేదీన ప్రాజెక్ట్-K సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ని రివిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు చిత్ర బృందంలో ప్రభాస్ ,దీపిక, అమితాబచ్చన్ డైరెక్టర్ తదితరులు సైతం పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ ఎదురవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.