స్టార్ హీరో కొడుకు వేధింపులపై..క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి..!!

చైల్డ్ యాక్టర్ గా కొన్ని యాడ్స్లలో నటించిన కృతి శెట్టి.. మొదట డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మెగా హీరోతో నటించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది. తన మొదటి చిత్రంతోనే అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన కృతి శెట్టి ఆ తర్వాత ఎన్నో వరుస విజయాలను అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె పలు సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది.

Tollywood Actress Krithi Shetty Looking Gorgeous In Saree Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos

దీంతో టాలీవుడ్లో సినిమాలు చేస్తూనే మరొక పక్క తమిళంలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అయితే తాజాగా కృతి శెట్టిని ఒక స్టార్ హీరో కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వినిపించాయట.. తమిళంలో ఒక స్టార్ హీరో కొడుకు ఆమెను వెళుతున్న ప్రతి ఫంక్షన్ కు కూడా అటెండ్ అవుతూ ప్రతిచోటకు వెళుతూ ఆమెకు కాల్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమెను స్నేహితురాలుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపించాయి. అయితే ఈ విషయంపై కృతి శెట్టి ఇబ్బంది పడుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు రావడం జరుగుతోంది.

Krithi Shetty Height, Weight, Size, DOB, Husband, Boyfriends, Family, Biography - News Resolution

అయితే ఈ విషయంపై కృతి శెట్టి తాజాగా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దయ చేసి ఇలాంటి వార్తలను సృష్టించకండి సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం అసలు చేయవద్దండి అంటూ చేతులు జోడించి ఒక ట్విట్ ని షేర్ చేయడం జరిగింది.. అసలు ఏమాత్రం సెన్స్ లేని ఇలాంటి పుకార్లను లైట్ తీసుకుందామనుకున్న కానీ హద్దులు దాటి ఈ వార్త చాలా ముందుకు వెళుతోంది అంటూ అందుకే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందంటూ తెలియజేసింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ఆమ్మడి చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు కానీ తమిళంలో జినీ అనే చిత్రంలో నటిస్తోంది.