దమ్ముంటే ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇండస్ట్రీలో నెం 1 ఫ్యామిలీ ఏది..?

టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది నాలుగే నాలుగు పేర్లు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ – విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగార్జున. ఈ నలుగురు పేర్లు తర్వాతనే మరి ఏ హీరో పేరు అయినా గుర్తొస్తుంది . ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడాకుల వార్తలు వింటున్నాం . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వైరల్ గా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్న సంఖ్య ఎక్కువైపోతుంది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ హీరో ఎవరు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు..?

అంతేకాదు 100 కోట్ల పారితోషకం తీసుకుంటే నిజమైన హీరో అయిపోతాడా..? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మంచిదై ఉండాలిగా ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు . అయితే అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలని టాప్ హీరో అని ఎలా అంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు ఎవరి హీరో ఫ్యాన్స్ ఆ హీరోకి సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు ఫ్యాన్స్ వేరే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అసలైన నెంబర్ వన్ హీరో నందమూరి బాలకృష్ణ అంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళ ఫ్యామిలీలో విడాకులు తీసుకునిందే లేదు . మెగాస్టార్ చిరంజీవి కుటుంబలో ఎంతమంది విడాకులు తీసుకున్నారో అస్సలు చెప్పనవసరం లేదు . దగ్గుబాటి ఫ్యామిలీలోనూ దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మీ విడాకులు తీసుకుంది. అంతేకాదు దగ్గుబాటి అభిరామ్ శ్రీరెడ్డి తో ఎలాంటి వేషాలు వేశాడో పబ్లిక్ గానే ఓపెన్ అయ్యాయి.

అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు . నాన్న – అన్న – తమ్ముడు అందరూ కూడా విడాకులు తీసుకున్నారు . కేవలం నందమూరి ఫ్యామిలీలో మాత్రమే ఎటువంటి రిమార్క్ లేకుండా ముందుకు వెళ్తున్నారని.. అందుకే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే నందమూరి బాలయ్య అని చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సరికొత్త వార్ వైరల్ గా మారింది..!!