అనుష్క చేసిన చెత్త పని.. పవన్ తో నటించే ఛాన్స్ మిస్.. ఆ మూవీ ఏంటో తెలిస్తే నవ్వేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కాబోలు భళే విచిత్రంగా సెట్ అవుతుంటాయి. వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగోలేకపోయినా సరే తెర పై వాళ్ల కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవుతూ ఉంటుంది . ఒకవేళ ఈడు జోడు బాగున్నా.. తెరపై కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వదు. కానీ జనాలు మాత్రం ఆ జంటలను తెగ లైక్ చేస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని కాంబోలు చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతూ ఉంటారు .

టైం కలిసి రాకో.. లేక వాళ్ళిద్దరూ ఇష్టపడరో.. కారణం ఏదైనా కావచ్చు కొన్నిసార్లు అలాంటి కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబోనే పవన్ కళ్యాణ్ – అనుష్క. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలు చేశాడు . అనుష్క కూడా ఎన్నో సినిమాలు చేసింది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేకపోయారు . వీళ్లిద్దరు హైట్ కి వెయిట్ కి బాగా మ్యాచ్ అవుతుందని ..కలిసి నటిస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక.

అయితే ఆ కోరిక నెరవేరదు అన్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే గతంలో ఓసారి మాత్రం అవకాశం వచ్చింది కానీ ..అది వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా అన్నవరం . సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. కానీ పవన్ కళ్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అసిన్. అయితే మొదటగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి ని అనుకున్నారట మేకర్స్ . అయితే అప్పటికే స్టాలిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో.. మన సినిమాలో ఇలాంటి అమ్మాయి వద్దు అంటూ మేకర్స్ రిజెక్ట్ చేసారట . అలా అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఆ తర్వాత సెట్ అవ్వనే లేదు ..ఇక భవిష్యత్తులో కుదురుతుంది అన్న నమ్మకాలు లేవు..!!