సలార్ టీజర్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ నటుడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం యూట్యూబ్లో సలార్ సినిమా టీజర్ ఎంతటి ట్రెండ్ సెట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ విడుదలైన కొన్ని సెకన్లలోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా టీజ ర్లో ,ప్రభాస్ ని కేవలం 10 సెకండ్లు కంటే ఎక్కువగా చూపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరోత్సాహత ఉన్నారని చెప్పవచ్చు. కానీ టీజర్ మొత్తంలో సలార్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నారు.

ఈ నటుడు సలార్ సినిమాలో..సింహ, చిరుత ,పులి, జురాసిక్ పార్క్ , డైనోసార్ అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. అలా చెప్పిన వ్యక్తి ఎవరో కాదు నటుడు ఆనంద్.. పాన్ ఇండియా ప్రభాస్ తో ఆనంద్ చేస్తున్న రెండవ చిత్రం ఇది.గతంలో సాహో సినిమాలో కూడా ఈయన నటించడం జరిగింది. ఇప్పుడు సలార్ సినిమాలో నటిస్తున్నారు. గతంలో ఎన్నో తెలుగు చిత్రాలలో ఆనంద్ నటించిన జరిగింది ముఖ్యంగా బాలయ్య నటించిన ఆదిత్య 369 చిత్రంతోపాటు చిరంజీవి నటించిన అంజి సినిమాలో భాటియా పాత్రలో నటించారు.

ఇక గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్న సీతారామం చిత్రంలో కూడా నటించారు.. ఇక ఆనంద్ ఫ్యామిలీ పూర్తిగా ఇండస్ట్రీకి చెందిన వారి ఈయన మేనల్లుడు కూడా సిద్ధార్థ ఆనంద్.. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆనంద్ ఇలా ఎన్నో చిత్రాలలో తెలుగులో నటించిన ఇప్పుడు సలార్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంతిని ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.