జాన్వీ కపూర్ కన్నా ముందే “దేవర” సినిమాకి అనుకున్న హీరోయిన్ ఆమె.. అగ్రిమెంట్ పై సైన్ చేసి క్యాన్సిల్ ..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కాగ ఈ సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేస్తుంది దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ .

ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అయితే జాన్వి కపూర్ కంటే ముందే ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా కొరటాల శివ అలియాభట్ ని చూస్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని అనఫిషియల్ గా కూడా కన్ఫర్మ్ చేసింది ఆలియా . ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో నటించబోతున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది .

అయితే ఆ తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ రావడంతో సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు బ్రేక్ చెప్పడంతో అలియా ఈ సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నాడు కొరటాల శివ . దీంతో ఆ అగ్రిమెంట్ పై సైన్ చేసిన ఆలియా రెమ్యూనరేషన్ అమౌంట్ తిరిగి ఇచ్చేసి మరి ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకుంది . దీంతో ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!