ప్ర‌భాస్ `ప్రాజెక్ట్‌-కె` టైటిల్ ఏంటో తెలిసిపోయింది.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వని దత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి అగ్ర తార‌లు భాగం కావ‌డంతో.. నేష‌న‌ల్ వైడ్ గా ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

అలాగే ఎప్పుడైతే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో ప్రాజెక్ట్ కె లాంచ్ అవుతుంద‌ని తెలిసిందో.. అప్పుడే ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కామిక్-కాన్ 2023 వేడుక‌లు జూన్ 20న ప్రారంభం కానున్నాయి. ఈ వేడ‌క‌లో అదే రోజే ప్రాజెక్ట్ కె టైటిల్‌, ట్రైల‌ర్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయ‌బోతున్నాడు. ఈ అరుదైన ఘ‌నతను ద‌క్కించుకున్న తొలి ఇండియ‌న్ ఫిల్మ్ `ప్రాజెక్ట్ కె`నే కావ‌డం మ‌రొక విశేషం.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో అసలు డిస్కషన్‌ మొదలైంది. అస‌లు కె అంటే ఏంటి? ప్రాజెక్ట్ కె అని ఎందుకు పెట్టారు..? అని నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు. గ‌తంలో ప్రాజెక్ట్ కె అంటూ క‌ర్ణ, క‌ల్కీ అనే పేర్లు వైర‌ల్ అయ్యాయి. కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీకి `కాలచక్ర` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. కె అంటూ కాల‌చ‌క్ర అని అర్థ‌మ‌ని టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంద‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.