సింగర్ సునీత బెస్ట్ ఫ్రెండ్ వీరే?

సింగర్ సునీత గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అందంతో పాటు అందమైన గాత్రం ఉన్న సింగర్స్ లో సునీత ఒకరు. ఆమె గళంలో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. వీటిలో మచ్చుకు ఒకటి చెప్పుకోవాలంటే ‘ఈ వేళలో నీవు’ అనే పాట గురించి చెప్పుకుంటే చాలు. ఆమె ప్రతిభ ఏమిటో ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇలాంటి పాటలను ఎన్నింటినో ఆలపించిన సునీత అంటే ఇక్కడి ప్రేక్షకులకు మంచి గురి. ఆమె పాటలు మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు అని చెప్పుకోవచ్చు. తన మృదుమధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత.

ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న సునీత తన పెర్సనల్ లైఫ్ లో కూడా చాలా సంతోషంగా వుంది. మరోవైపు ఎప్పటికపుడు తాజా అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సింగర్ సునీత. ఈ క్రమంలో రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటుంది సునీత. తాజాగా సునీత పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సునీత ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఇంటెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. అవును, సింగర్ సునీతకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసింది.

ఇక ఆమె ఎవరో తెలిస్తే అవాక్కవుతారు. ఆమె మరెవ్వరో కాదు, స్టార్ యాంకర్ సుమ. అవును, ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ సుమ అంటూ ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ లవ్ ఎమోజిస్ షేర్ చేశారు సునీత. గతంలో సుమ కనకాల తన బెస్ట్ ఫ్రెండ్ అని పలు సందర్భాల్లో తెలిపిన విషయం తెలిసిందే. ఇకపొతే సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు నౌకరి’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భావన అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపైన సునీత కాస్త గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కొడుకు జీవితం కోసం ఆమె చాలా ఆరాటపడుతోంది.