భర్తతో కలిసి రొమాంటిక్ ట్రిప్ వేసిన కాజల్.. హాట్ అందాలు చూపిస్తూ సెగలు!

ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్‌ఫుల్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం కాజల్ చేతులో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని వివాదాలు కారణంగా ఆగిపోయిన ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కమల్‌ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో భారతీయుడు 2 మేకర్స్, దర్శకుడు శంకర్‌తో కాంప్రమైజ్ అయ్యారు. దాంతో దర్శకుడు శంకర్ ఈ సినిమా షూటింగ్‌ని వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరో 20 రోజుల్లో భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

ఈ సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ మొదటిసారి కమల్‌ హాసన్‌తో కలిసి నటిస్తోంది. అలానే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కాజల్, బాలకృష్ణ జంటగా నటించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఇక భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల కీలకపాత్రలో నటిస్తుంది. బాలకృష్ణ, కాజల్, శ్రీ లీల నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే కాజల్ తన బిజీ లైఫ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి తన భర్తతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టర్కీ దేశంలోని అందమైన ప్రదేశాలను తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఆస్వాదిస్తుంది. కాజల్, గౌతమ్ కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి వారిద్దరికీ అభిమానులు బెస్ట్ కపుల్ విషెస్ తెలియజేస్తున్నారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కీచ్లు 2020లో వివాహం చేసుకున్నారు. ఇక గత ఏడాది ఏప్రిల్ లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. కాజల్ కొడుకు పేరు నీల్ కీచ్లు.