బావమరిది కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టిన ఎన్టీఆర్ .. జాక్ పాట్ ఆఫర్ కొట్టాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను సపోర్ట్ గా తీసుకుంటూ ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు నితిన్. నితిన్ అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న టాప్ హీరో కాదు.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాడు . ఈ నితిన్ ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ బావమరిది . లక్ష్మీ ప్రణతి బ్రదర్.

ఇప్పటికే ఓ సినిమాలో నటించాడు . ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది . త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నాడు . శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే టైటిల్ తో తెర. కెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ ను అల్లాడించడానికి రిలీజ్ కు సిద్ధమవుతుంది ఇలాంటి క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమా సైతం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఈసారి ఓ బడా ప్రొడ్యూసర్ కంట్లో పడ్డాడు.

ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన సెకండ్ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీలను హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట మేకర్స్. అంతేకాదు ఎన్టీఆర్ సైతం శ్రీలీల కే ఓటు వేశాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు రెండో సినిమాకే స్టార్ హీరోయిని శ్రీలీలతో ఆఫర్ పట్టేసాడు అంటే మంచి మ్యాటర్ ఉంది పిల్లాడిలో అంటూ ట్యాగ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు..!!