యాంకర్ స్రవంతి ఘాటైన ఫోటో షూట్!

తెలుగులో ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్రమేపీ యాంకర్ల సంఖ్య పెరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే, వీళ్లలో కొందరు మాత్రమే బుల్లితెరపై షోలు చేస్తున్న పరిస్థితి. మిగిలిన వాళ్లు ప్రైవేటు ఈవెంట్లనే చేస్తూ డబ్బు గడిస్తున్నారు. అందులో ‘స్రవంతి చోకారపు’ ఒకరు. ఫ్రీల్యాన్స్ యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ భామ.. చేతి నిండా ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇక అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ హడావిడి చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేసే స్రవంతి చోకారపు.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసి సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది.

హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ వెళ్తోన్న సమయంలో స్రవంతి ఓ సినిమా షూటింగ్‌ను చూసేందుకు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించడం జరిగింది. కట్ చేస్తే ఈ మూవీలో తనదైన నటనతో మెప్పించడంతో ఆమె యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసింది. దీంతో స్రవంతి ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో తర్వాత యాంకర్‌గా మారింది. మొదటి ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై అనేక షోలను హోస్ట్ చేసింది. అందులో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ షో మాత్రమే సక్సెస్ కావడం కొసమెరుపు.

ఆ తరువాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది స్రవంతి. ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. తరువాత వేరే వేరుగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి మళ్లీ వివాహం చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా పుట్టిన విషయం మనకు తెలిసినదే. ఇక ఈ మధ్య కాలంలో స్రవంతి వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో బిజీగా మారింది. మరోవైపు యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తన అందాల ఆరబోతతో రచ్చ చేసింది.