ఆనంద్ దేవరకొండ పై సంచలన ట్వీట్ చేసిన అనసూయ..!!

గత కొద్దిరోజుల నుంచి యాంకర్ అనసూయ హీరో విజయ్ దేవరకొండ మధ్య వివాదం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలో తల్లి గురించి కించపరిచే విధంగా మాట్లాడిన భాషను అనసూయ తప్పు పట్టడం జరిగింది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైర్యం నెలకొంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ అంతలోనే అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది.ఇలాంటి వివాదాలకు స్వస్తి చెప్పాలని అనసూయ ఇటీవలే బహిరంగంగా ఒక లేఖను రాస్తూ తెలియజేయడం జరిగింది.

Anasuya Bharadwaj – A tribal girl in Pushpa

తాజాగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమా పైన ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. అనసూయ ట్విట్టర్ లో ఇలా రాసకొస్తూ పార్టీకి చాలా ఆలస్యం అయ్యింది కానీ ఎప్పుడూ లేనంత ఆలస్యం లవ్ లవ్ ట్రైలర్ కి సంబంధించి ఒరిజినాలిటీ నాకు తెలిసిన వాళ్ళ కథలాగే అనిపిస్తోంది అంటూ అందుకోసం వేచి ఉండలేను అంటే తెలియజేస్తోంది.. ఇక మీ గురించి ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను సాయి రాజశేఖర్ గారు అంటూ ట్విట్ చేసింది.. అలాగే వీరాజ్ అశ్విన్ మీరు కూడా చాలా కూల్ గా కనిపిస్తూ ఉన్నారు. ఆనంద్ దేవరకొండ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని రాసుకురావడం జరిగింది.

ఆనంద్ ని పొగిడేస్తూ బేబీ చిత్రం పైన అనసూయ ఇలాంటివి చేయడానికి ఇది నిజంగానే పొగడ్తన లేకపోతే ఏంటా అనే విషయంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బేబీ సినిమా కథ తన పరిచయస్తుల నిజజీవిత కథను పోలి ఉందని అనసూయ తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా అనసూయ ట్విట్లకు స్పందనలు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. మరేం జరుగుతుందో చూడాలి మరి.