టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులు.. మృణాల్ మాయ‌లో ప‌డితే కొంప కొల్లేరే!

సీరియ‌ల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మృణాల్ ఠాకూర్‌.. బాలీవుడ్ లో ప‌లు చిత్రాలు చేసింది. అక్క‌డ గుర్తింపు వ‌చ్చింది. కానీ, స్టార్ హోదా మాత్రం దక్క‌లేదు. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో మృణాల్ జాత‌క‌మే మారిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది.

సీతారామం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వ‌డంతో.. మృణాల్ సౌత్ తో పాటు నార్త్ లోనూ య‌మా పాపుల‌ర్ అయింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇటీవ‌లె బోల్డ్ వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన మృణాల్.. ఇప్పుడు తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానీతో ఓ సినిమా, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయింది.

అలాగే బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్ చేసింది. ఇదిలా ఉంటే.. మృణాల్ తాజా ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ క‌ల‌ర్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన మృణాల్‌.. ఓవైపు ఎద అందాలు, మ‌రోవైపు థైస్ సోయ‌గాల‌ను చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ మాయ‌లో ప‌డితే కొంత కొల్లేరే అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)