ఛీ ఛీ అంటూ తెలుగు మూవీని రిజెక్ట్ చేసిన సూర్య .. బిగ్గెస్ట్ హిట్ గా మార్చిన మహేశ్.. ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు హీరోలు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు . దాని కారణంగా చాలా బాధపడాల్సి వస్తుంది. అయితే అలా తనకు తెలియకుండా తాను తప్పు చేసి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా బాధపడ్డారు ..వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కధ.. మరో హీరో చేయడం సర్వసాధారణం. మన ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అలాగే హిట్టు కొట్టారు .

అయితే అలాంటి లిస్టులోకే ఆడ్ అయిపోతారు కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్య. మల్టీ టాలెంటెడ్ నటుడుగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్న సూర్య గతంలో ఓ తెలుగు డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా బిజినెస్ మాన్ .

ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే పూరీ జగన్నాథ్ ఈ కథను ముందుగా సూర్యకు వివరించారట . అయితే కథలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పాల్సి ఉండడంతో సూర్య ఈ పాత్ర రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత మహేష్ బాబు ఈ సినిమాను యాక్సెప్ట్ చేసి హిట్ అందుకున్నాడు. రిజల్ట్ చూసిన తర్వాత సూర్య చాలా బాధపడ్డారట. ఛీ ఛీ అనవసరంగా ఈ సినిమాని మిస్ చేసుకున్నానా..? అంటూ తెగ ఫీల్ అయిపోయారట..!!