ఈ పాన్ ఇండియా హీరోకి కోపం వస్తే..పరిగెత్తుకుంటూ వెళ్లి మొదట చేసే పని అదే..!!

మనిషి అన్నాక కోపం రావడం చాలా కామన్..ఎలాంటి మనిషికైనా కోపం వస్తుంది.. కోపం వచ్చినప్పుడు కోపం లో మాట తూలుతూ ఉంటారు . ఈ తప్పు మనలో అందరూ చాలామంది చేసేదే ..అయితే కోపం వచ్చినా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదుటివారిని హర్ట్ చేయకుండా తనని తాను హార్ట్ చేసుకోకుండా కూల్ గా నిర్ణయం తీసుకుంటాడు ఈ పాన్ ఇండియా హీరో అంటూ తన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ..ఎంత జోష్ మీద ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది . అది ఏ ఈవెంట్ లోనైనా.. షూట్ లోనైనా ..వెకేషన్ లో అయినా.. బన్నీ ఉంటే ఆ మజానే వేరు.. ఆ కిక్కే వేరు అంటుంటారు కుటుంబ సభ్యులు . అయితే ఇలాంటి బన్నీ కి కూడా కోపం వస్తుంది అని చాలా తక్కువ మందికే తెలుసు.

ఎప్పుడు సరదా సరదాగా ఉండే బన్నీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కారణంగా కొన్ని కొన్ని సార్లు కోపం వస్తూ ఉంటుందట. అయితే అందరిలా కాకుండా బన్నీ చాలా డిఫరెంట్గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడట . తనకి కోపం వస్తే చాలు పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి ఎవ్వరు లేకుండా తను ఒక్కడే బెడ్ పై పడుకొని కూల్ గా మైండ్ రిలాక్స్ చేసుకుంటారట . ఎప్పుడైతే కోపం కంట్రోల్ అవుతుందో ఆ తర్వాతే రూమ్ బయటకి వచ్చి భార్యా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారట. అంతేకానీ అందరిలా బయట కోపాలని ఇంట్లో భార్యపై పిల్లలపై చూపించాడట. ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు..!!