“బేబి” సినిమా ఆ తెలుగు హీరో రియల్ స్టోరీనా..? ఏం ట్విస్ట్ ఇచ్చావు రా డైరెక్టర్ బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు హీట్ అవుతుందో ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . మరి ముఖ్యంగా కోట్లకు కోట్లు పోసి భారీ బడ్జెట్లో తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి . అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సింపుల్గా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తున్నాయి . ఈ క్రమంలోని ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకునింది. సినిమా కథ విషయానికి వస్తే చిన్నతనంలోనే గాఢంగా ప్రేమించుకుంటారు ఆనంద్ – వైష్ణవి. అయితే ఆనంద్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది కారణంగా సగంలోని చదువు ఆపేస్తాడు . అయితే మొదటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వైష్ణవి మాత్రం చదువుల కోసం ఇంటికి దూరంగా వెళ్తుంది .

ఈ క్రమంలోని వాళ్ళ మధ్య ప్రేమ ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతో అన్నం పెట్టే ఆటో ను అమ్మి మరి రెండు ఫోన్లు కొంటాడు . అయినా వాళ్ల మధ్య దూరం పెరిగిపోతుంది . ఈ క్రమంలోనే అప్పటివరకు నాలుగు గోడల మధ్య పెరిగిన వైష్ణవి ఒక్కసారిగా ప్రపంచాన్ని చూడడంతో ..ఆమె నేటి జనరేషన్ కి అట్రాక్ట్ గురవుతుంది. బ్యూటీ పార్లర్.. ట్రెండీ మోడరన్ డ్రెస్సెస్.. ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకుంటుంది . అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం ఇంకా ఆమె తన బేబీ వైష్ణవి అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే మధ్యలోకి ఎంటర్ అయిన విరాజ్ కధను టోటల్ మలుపు తిప్పేస్తాడు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఓ యంగ్ హీరో లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ యంగ్ హీరో సాయి రాజేష్ కి మంచి ఫ్రెండ్ కూడా.. అందుకే ఆయన పేరును బయటకి రానివ్వకుండా.. ఈ సినిమాను తెరకెక్కించారు. రియల్ స్టోరీ కావడంతో ఈ సినిమా మంచి విజయాని అందుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!