వావ్: “క్లీం కార” సంతోషం కోసం చరణ్-ఉపాసన ఏం చేసారో చూడండి..గ్రేట్ పేరంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల్లో తన టచ్ చేసే వాళ్ళు లేరు అన్నంత రేంజ్ లో టాప్ పొజిషన్లో ఉన్న రాంచరణ్ ఫ్యామిలీ పరంగా కూడా అదే పోసిషన్ లో ఉన్నాడు . రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన మెగా సన్ రామ్ చరణ్ పండు లాంటి పాపకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే . జూన్ 20వ తేదీ మెగా కోడలు పిల్ల ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో ఒంటిగంట 49 నిమిషాలకు పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. బారసాల ఫంక్షన్ పూర్తి చేసి పాపకు ఎంతో పవిత్రమైన పేరుని పట్టుకొచ్చారు. “క్లీం కార” అంటూ నామకరణం చేశారు .

లలితా సహస్రనామంలోని పదాలను తీసుకొని “క్లీంకార” అనే పేరుని ఆమెకు పట్టుకొచ్చారు . రామ్ చరణ్ – ఉపాసన బేబీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు . కోట్లు ఖర్చుపెట్టి ఇంటీరియర్ డిజైనర్ చేయించే స్తోమత ఉన్న వీళ్ళు చాలా సింపుల్ అండ్ క్లాసిక్ అట్రాక్టివ్ వేగా ఉండే డిజైన్స్ ను చూస్ చేసుకుని ..క్లీం కార రూమ్ ను డెకరేట్ చేశారు. పిల్లలు కోరుకునే బొమ్మలు ..ఎలిఫెంట్ ..ఫారెస్ట్ చెట్లు ఎంతో ఆహ్లాదకరమైన మనసుకు ప్రశాంతంగా కలిగించే ఒక ధీమ్ ని సెట్ చేసుకున్నారు.

ఇదే విషయాన్ని ఉపాసన వీడియో రూపంలో అభిమానులతో షేర్ చేసుకుంది. కాగా పవిత్ర రాజారాం అనే ఆర్కిటెక్ట్ తో ఉపాసన ఈ డిజైన్ రెడీ చేశారు. ఉపాసన సజెస్ట్ చేసిన ప్రకారమే ఆమె ఇలా సరికొత్త ఫారెస్ట్ ధీమ్ తో రూమ్ ఇంటీరియర్ డిజైన్ చేశారట . ఒక్కటి కాదు రెండు కాదు సాఫ్ట్ గా ఉండే సోఫాలు ..మ్యాటృఈసెస్.. టేబుల్స్.. పిల్లోస్ ..కర్టన్స్ ఆహ్లాద భరితంగా గదిని డిజైన్ చేయించారు పవిత్ర రాజారాం. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు పాప విషయంలో చరణ్ ఉపాసన చాలా కేరింగ్ గా ఉన్నారు అంటూ కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!