నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మరియు నాగబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా మెప్పించలేకపోయింది. అల్లు అర్జున లుక్, నటన పరంగా ఈ సినిమాలో వేరియేషన్ చూపించినా కథలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా డిజాస్టర్ అయింది.
అయితే నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ చేయాల్సిందట. కానీ, ఆయన చాలా తెలివిగా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తప్పించుకున్నారు. అవును, వక్కంతం వంశీ మొదట ఈ సినిమా కథను ఎన్టీఆర్ కే చెప్పాడట. కథలో లోపాలు ఉన్నాయని భావించిన ఎన్టీఆర్.. డేట్స్ ఖాళీగా లేవని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట. ఆ తర్వాత బన్నీకి కథ నచ్చడంతో.. మూవీ చేశాడు. డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.