చైతన్య తో నీహారిక విడాకులు.. మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ గా ఉన్నారా..?

లైఫ్ లో ఏది మనం అనుకున్నట్లు జరగదు.. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ తప్పుడు నిర్ణయాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ తప్పుడు నిర్ణయాల కారణంగా లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి . అయితే ప్రెసెంట్ అలాంటి తెలియని అయోమయ స్థితిలోనే ఉండిపోయింది మెగా డాటర్ నిహారిక అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పేరు సోషల్ మీడియాలో టామ్ టామ్ అవుతుంది.

దానికి మెయిన్ రీజన్ ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అని వార్తలు రావడమే. అయితే ఇలాంటి వార్తలు పై నిహారిక అస్సలు నెగిటివ్గా స్పందించలేదు . “మేం విడాకులు తీసుకోవడం లేదు “అంటూ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు . అందుకే నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ మెగా ఫాన్స్ ముందుగానే కన్ఫామ్ అయిపోయారు . పైగా తన అన్న వరుణ్ నిశ్చితార్ధంలో నిహారిక సింగిల్గానే కనిపించింది . మెడలో తాళి కూడా వేసుకోలేదు.. నుదుటిన బొట్టు కూడా పెట్టుకోలేదు .

దీంతో మెగా డాటర్ అనఫిషియల్ గానే తన విడాకులను కన్ఫామ్ చేసింది . కాగా రీసెంట్గా వీళ్ళిద్దరికీ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసినట్లు కొన్ని డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే నిహారిక విడాకులపై చిరంజీవి చాలా పాజిటివ్గా స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నీహారిక విడాకులు తీసుకోవాలి అని అనుకుంటుంది అని నాగబాబు చెప్పిన్నప్పుడు..చిరంజీవి తన ఇష్టం అంటూ సైలెంట్ అయిపోయారట.

దానికి మెయిన్ రీజన్స్ శ్రీజనే అంటూ తెలుస్తుంది . ఇష్టం లేని వాళ్ళతో ఎంత బలవంతం చేసిన ఉండలేరు ..ఆ కారణంగానే మీ లైఫ్ మీ ఇష్టం అంటూ శ్రీజను – నిహారికను వాళ్ళ సొంత డెసిషన్ తీసుకొమని అవకాశం ఇచ్చాడట చిరంజీవి . దీంతో నిహారిక విడాకులు తీసుకోవడం చిరంజీవికి ఇష్టమే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!