“రోజు ముద్దులు పెట్టాలి..అప్పుడే లైఫ్ బాగుంటుంది”.. శృతి హాసన్ మాటలు మీకు అర్ధమవుతున్నాయా అమ్మాయిలు-అబ్బాయిలు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. హీరోయిన్ శృతిహాసన్ కు ఎవరు సాటిరారనే చెప్పాలి . ఉన్నది ఉన్నట్లు ముఖాన్నే నిక్కచ్చిగా మాట్లాడే శృతిహాసన్ అంటే స్టార్ హీరోలకి కూడా వణుకు . అందుకే ఆమెను సినిమాల్లో పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎక్కడ ఉన్న విషయం బయట పెట్టేస్తుందో అన్న భయం ఎక్కువగా ఉంటుంది . కాగ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తూ వచ్చిన ఆఫర్స్ సరిపెట్టుకుంటున్న శృతిహాసన్.. రీసెంట్గా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఎలాంటి పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకి కొత్త రకమైన ఫీలింగ్స్ కలగజేస్తుందో మనందరికీ తెలిసిందే . కాగా ఇలాంటి క్రమంలోనే శృతిహాసన్ లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ నోట్ ను షేర్ చేసింది. శృతిహాసన్ పోస్ట్ చేసిన షేర్ ఎలా ఉందంటే ..”ప్రతిరోజు యుద్ధం చేయడం కాదు ఇంట్లో సరదాగా కూర్చొని స్నాక్స్ తినడం.. మన పెట్స్ ని ప్రేమగా చూసుకోవడం ..వాటితో ఆడుకోవడం.. వాటికి ముద్దులు పెడుతూ ఉండడం ..ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కూడా ఓ ఇంపార్టెంట్ విషయం అని ఇప్పుడే రియలైజ్ అయ్యాను” అంటూ రాసుకొచ్చింది.

దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఈ పోస్ట్ ని వల్గర్ గా ట్రెండ్ చేస్తున్నారు . ఆమె ముద్దులుపెట్టమనింది పెట్స్ కి మీరు ఇంకేదో అర్థం చేసుకోకండి రా అబ్బాయిలు – అమ్మాయిలు అంటూ జనాలు క్లారిటీగా అర్థమయ్యేలా మళ్లీ శృతిహాసన్ చేసిన పోస్ట్ ని వైరల్ గా మార్చేస్తున్నారు..!!