విడుదలకు ముందే రజనీకాంత్ జైలర్ సినిమాకు షాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాటలు విడుదల కాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా తమన్నా డాన్స్ స్టెప్పులు వైరల్ గా మారుతున్నాయి. అంతగా జనాలకు ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకుంది. తమన్నా కంప్లీట్ గా గ్లామర్ లుక్కులు ఈ పాటలో అదరగొట్టేసిందని చెప్పవచ్చు.

rajinikanth: Superstar Rajinikanth's next film titled 'Jailer', to be helmed by 'Beast' director Nelson Dilipkumar - The Economic Times

జైలర్ అనే టైటిల్ని మలయాళంలో డైరెక్టర్ సిక్కిర్ మడతిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ జైలర్ చిత్రం రిలీజ్ ఆగస్టు 10వ తేదీన చేయబోతున్నారు దీంతో ఈ రెండు చిత్రాల టైటిల్ ఒకటే కావడంతో తన చిత్రం నష్టపోయే అవకాశం ఉందంటూ మలయాళ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ మడతీల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ జైలర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్ సంస్థని టైటిల్ మార్చుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందట.

Same Title – Two Movies: Brakes for Rajini Movie Release..?! | Rajinikanth's upcoming film Jailer has landed in trouble due to its title

కానీ వాళ్లు నిరాకరించడంతో రజనీ జైలర్ వల్ల మేము చాలా నష్టపోయే అవకాశం ఉంది కనీసం మలయాళం లోనైనా రజినీకాంత్ టైటిల్ మార్చుకోవాలని కోరినట్లు తెలియజేశారు. ఇక తాము జైలర్ టైటిల్ని 2021 ఆగస్టులో కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేశామని కొన్ని ఆర్థిక సమస్యల వల్ల సినిమా ఆలస్యం అవుతుందని తెలియజేశారు. అయితే మా కంటే పది రోజుల ముందు రజిని చిత్ర టైటిల్ బయటికి వచ్చింది కానీ మేము ముందుగానే రిజిస్ట్రేషన్ చేశామని తెలియజేశారు డైరెక్టర్. దీన్నిబట్టి చూస్తే జైలర్ సినిమాకు విడుదల ముందే గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోందంటూ పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.