గుంటూరు కారం నుండి లీకైన క్రేజీ పిక్.. ఏం కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాడు రా సామీ..రికార్డులు బద్ధలే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సినీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఒకటి . సర్కారి వారి పాట సినిమా తర్వాత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా లో కంప్లీట్ గా మహేష్ బాబు ఢిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో కమిట్ అవ్వడం ఓ విశేషం అని చెప్పాలి . వీళ్ల కాంబో వస్తున్న మూడో సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్ పక్క అంటున్నారు అభిమానులు .

ఈ సినిమాకి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . ముందు నుంచి ఈ సినిమా మొత్తం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి . అయితే వాటిని నిజం చేస్తూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ పోస్టర్ ఆధారంగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో పొలిటిషియన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడిగా ఓ ఫ్లెక్సీలో కనపడుతూ ఉంటాడు .

ఇది గుంటూరు కారం సినిమాలోని ఓ పోస్టర్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ ఫ్లెక్సీలో” ప్రజా బంధు జనగలం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైరా వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు ..జన్మదిన పార్టీ యువజన నాయకులు నిజామాబాద్ జిల్లా అని” అందులో రాసి ఉంటుంది. అయితే ఈ పోస్టర్ చూసి ఎవరైనా సరే ఇది ఎవరిదో ..ఈ పోస్టర్ ఎవరి గురించి అని క్లియర్గా అర్థం అయిపోతుంది. అయితే అసలు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేని మహేష్ బాబును రాజకీయ కోణంలో సినిమాలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది..!!