చిలకపచ్చ డ్రెస్‌లో అందాలు బయట పెడుతూ కాక రేపుతున్న భాను శ్రీ..

బుల్లితెర నటి యాంకర్ అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్ ద్వారా పరిచయమైన ఈ అమ్మడు 2017లో విడుదల అయిన బాహుబలి సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆ తరువాత బిగ్‌బాస్ 2లో కంటెస్టెంట్‌గా అవకాశం కూడా దక్కించుకుంది. బిగ్‌బాస్ తరువాత మరింత ఫేమస్ అయిన భాను శ్రీ బుల్లితెరపై పలు షోస్ లో పార్టిసిపేట్ చేసింది. తన మాటలతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

భాను శ్రీ 1988 లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జన్మించింది. హన్మకొండలో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకి చిన్నప్పటినుండి డాన్స్ పై ఉన్న ఇష్టంతో కొరియోగ్రాఫర్ అవ్వాలని హైదరాబాద్ కి వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’, ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమాలకు కొరి్యోగ్రఫీ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే బాహుబలి, కాటమరాయుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మహానుభావుడు లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ బ్యూటీ వెండి తెరపై, బుల్లి తెర పై నే కాకుండా సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

భానుశ్రీ తన లైఫ్ లో జరిగే అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలానే అపుడప్పుడు అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిలకపచ్చ రంగు డ్రెస్ వేసుకొని మెరిసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. చిలకపచ్చ రంగు డ్రెస్ పై ఉన్న చున్నీ ని తీసేస్తూ మరి తన అందాలను బయట పెట్టి కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది ఈ చిన్నది. ఆ డ్రెస్ లో భాను ని చూసి అచ్చం అందమైన చిలుకలా ఉన్నావ్ భాను అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భానుశ్రీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.