విడాకులను కన్ ఫామ్ చేసేసిన కలర్స్ స్వాతి..ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి బాసూ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజురోజుకి ఎక్కువగా కనిపిస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుని స్టార్ సెలబ్రిటీస్ స్టేటస్ అందుకున్న తర్వాత మా మధ్య బాండింగ్ కుదరలేదు .. అండర్స్టాండింగ్ లేదు అంటూ చెత్త చెత్త రీజన్స్ చెప్పి విడాకులు తీసుకుంటున్నారు స్టార్ సెలబ్స్. రీసెంట్గా అలా ఎంతో మంది జంటలు విడాకులు తీసుకున్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రత్యేక సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక కూడా రీసెంట్గా విడాకులు తీసుకుంది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది . దీంతో సోషల్ మీడియాలో నిహారిక ని ఏ రేంజ్ లో ఏకిపారేశారు జనాలు మనం చూసాం .

కాగా రీసెంట్ గా హీరోయిన్ కలర్స్ స్వాతి సైతం విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. తన ఫ్రెండ్ వికాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి కొన్నాళ్లపాటు బుద్ధిగానే కాపురం చేసుకుంది. అయితే కలర్స్ స్వాతి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూసింది . ఈ క్రమంలోని అది నచ్చక వికాస్ ఆమెను కండిషన్స్ పెట్టడం మొదలు పెట్టారట . దీంతో అతగాడి కండిషన్స్ భరించలేని కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి వార్తలు పై కలర్స్ స్వాతి ఎటువంటి నెగటివ్ కామెంట్ చేయకపోవడంతో ఇది నిజమే అంటూ భావిస్తున్నారు అభిమానులు .

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా కలర్స్ స్వాతి ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కలర్స్ స్వాతి బుర్ఖా ధరించింది. అంతేకాదు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కాసేపు అటు ఇటు తిరుగుతూ జనాల మధ్య సందడి చేసింది . అయితే ఆమె బుర్ఖా ధరించడంతో ఎవరు గుర్తుపట్టలేకపోయారు . అంతేకాదు కాసేపు బుక్ స్టాల్ లో టైం స్పెండ్ చేసిన కలర్స్ స్వాతి మంచి ఫిల్టర్ కాఫీ తాగి ఆ తర్వాత ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ ఎక్కాక బుర్ఖా తీసేసి ఒరిజినల్ ఫేస్ చూపించింది . దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా కలర్స్ స్వాతి తన మెడలో తాళి ..నుదుట బొట్టు ..కాళ్ళకి మెట్టెలు లేకపోవడంతో ఆమె నిజంగానే విడాకులు తీసుకుంటుందని ..అందుకే ఐదోతనానికి ప్రతిరూపమైన వాటిని ధరించకుండా మానేసింది అని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి వీడియో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Swathi (@swati194)