ఎవ్వరు ఊహించని హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న కొరటాల.. తేడా వస్తే మరో ఆచార్య నేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ .. ప్రజెంట్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా దేవర. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ సెలెక్ట్ అయింది . జాన్వి కపూర్ తెలుగులో మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది . ఇలాంటి క్రమంలోనే క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకుంటున్న కొరటాల సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం మృణాల్ ఠాకూర్ – రష్మిక మందనాలలో ఎవరో ఒకరిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట .

అయితే వాళ్ళిద్దరూ కన్నా ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి సనన్ ని ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నాడట . కొరటాల శివ కృతి సనన్ కూడా ఎన్టీఆర్ తో నటించడానికి రెడీగా ఉంది అంటూ గ్రీన్ సిగ్నల్ చేయడంతో కొరటాల అఫీషియల్ గా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కృతి సనన్ ను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ సినీ వర్గాలలో న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై ఫైర్ అవుతున్నారు.

అంతేకాదు హీరోయిన్స్ విషయంలో నువ్వు ఏ మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఈ సినిమా కూడా మరో ఆచార్య అవుతుంది అని కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకొని మంచి హీరోయిన్ సినిమాలో పెట్టమంటూ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఆచార్య సినిమా విషయంలో హీరోయిన్స్ కోసం ఏకంగా ఆరు నెలలు డిస్కస్ చేసి ఫైనల్లి అనుకున్న కాజల్ ని కూడా తీసేసాడు , దీంతో హీరోయిన్గా పూజ హెగ్డే మాత్రమే ఆచార్య సినిమా నిలబెట్టలేకపోయింది . దీంతో సినిమా అట్టర్ ప్లాప్ అయింది .దీంతో దేవర సినిమా విషయంలో ఇలాగే చేస్తే ఆచార్య2 టూ అవుతుందని హెచ్చరిస్తున్నారు ఫాన్స్..!!