ఆ రోజు రాత్రి స్నేహ లిమిట్స్ క్రాస్ చేసిందా..? తెలుగు స్టార్ హీరో తో అలా చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వసాధారణం. ఎలాంటి స్టార్ సెలబ్రిటీ పైన అయినా సరే గాసిప్స్ వస్తూ ఉంటాయి – పోతుంటాయి. అయితే ఇప్పటివరకు గాసిప్ రాని ఓ స్టార్ హీరోయిన్ పై గాసిప్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది బ్యూటీలు ఉన్నా హోంలీ బ్యూటీ స్నేహ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు . మరీ ముఖ్యంగా తన కెరియర్ లో నెగటివ్ అనే పదం లేకుండా చూసుకున్న స్నేహ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

స్నేహ తెలుగులో స్టార్ హీరోస్ తో కూడా నటించింది . ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునతో కూడా స్నేహ శ్రీరామదాసు అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . తెరపై వీళ్ళ జంట చాలా చక్కగా చూడముచ్చటగా ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది . కాగా అక్కడక్కడ కొంచెం లిమిట్స్ క్రాస్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ లో నటించారు . అయితే అది మొత్తం హెల్తీగానే చూపించాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు. అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్ స్నేహకు నాగార్జునకు మధ్య ఏదో సంబంధం ఉందన్న వార్త వైరల్ గా మారింది.

కాగా స్నేహ నాగార్జున తో శ్రీరామదాసు చేసే టైంలో ఆయనకు మరింత క్లోజ్ అయిపోయిందట . ముందు నుంచే నాగార్జున అంటే ఇష్టం ఉన్న స్నేహ ఆ తర్వాత ఆయనతో నటించే ఛాన్స్ రావడంతో సెకండ్ కూడా ఆయనతో మాట్లాడే ఛాన్స్ మిస్ చేసుకోలేదట. షూట్ అయిపోవడం మొదలు మాట్లాడుతూనే వచ్చిందట. ఈ క్రమంలోనే ఓ రోజు అసలు అర్ధరాత్రి టైం దాటింది అన్న కూడా తెలియకుండా ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ కూర్చునేసారట.

ఈ విషయం మీడియా లో లీక్ కావడంతో అప్పుడు వీళ్లిద్దరు మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . అయితే ఎప్పుడు ఎవరితో హద్దులు మీరని స్నేహ ఆరోజు టైం కూడా తెలియకుండా నాగార్జున గారితో మాట్లాడుతూ హద్దులు మీరి లిమిట్స్ క్రాస్ చేసింది అంటూ ప్రచారం చేశారు . అయితే పెళ్లి అయ్యి..ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మళ్లీ అదే వార్తను ట్రెండ్ చేస్తూ స్నేహ పరువును తీయాలని చూస్తున్నారు కొందరు ఆకతాయిలో . దీంతో స్నేహ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ..!!