కుర్రాళ్ల బాధను అర్ధం చేసుకున్న డైరెక్టర్.. ఆ సూపర్ హిట్ సినిమాకి సిక్వెల్ వచ్చేస్తుందోచ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో తాము తెరకెక్కించిన సినిమాలను మళ్లీ మరోసారి సీక్వెల్ గా తెరకెక్కిస్తూ క్యూట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు డైరెక్టర్ లు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్ లు అలా చేయగా..ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సెల్వరాఘవన్ సైతం అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు .

7/G బృందావన కాలనీ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా దర్శకుడుగా ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 20 ఏళ్లు గడుస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. కాగా అప్పట్లో ఈ సినిమా యువతకు తెగ నచ్చేసింది .

ఒక కామన్ కుర్రాడు ఇంట్లో ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తాడో క్లియర్ గా చూపించాడు సెల్వ రాఘవన్ . ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కావాలని పలువురు అభిమానులు డిమాండ్ చేసిన ఆయన పెద్దగా పట్టించుకోలేదు . ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు సెల్వ రాఘవన్ . 7/G బృందావన కాలనీలో సోనాలి – రవికృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఇంకా హీరోని చూస్ చేసుకోలేదు.. హీరోయిన్లుగా మాత్రం శంకర్ అదితి- ఇవానాలలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యాడు అని తెలుస్తుంది . మొత్తానికి ఇన్నాళ్లకి అభిమానుల బాధను అర్థం చేసుకొని ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు . మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకోబోతుందో చూడాలి..?