ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ హీరోలు వీరే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లాగా ఉన్న శర్వానంద్, నితిన్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగశౌర్య తదితరులు అందరూ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరికంటే ఎక్కువ వయసున్న వారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరు ఉన్నారు? వారి పేర్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

• ప్రభాస్

తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ వయసు ఉండి ఇంకా పెళ్లి చేసుకొని వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ అని చెప్పవచ్చు. 43 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకు రాకుండా ఈ హీరో లైఫ్ గడిపేస్తున్నాడు. ఈ అందగాడిని ఏ అమ్మాయి వరిస్తుందో చూడాలని అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. మరి వారి కోరిక త్వరలోనే నెరవేరుతుందో లేదో చూడాలి.

• రామ్ పోతినేని

రామ్ పోతినేని కంటే చాలా ఆలస్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. కానీ ఈ ఎనర్జిటిక్ హీరో ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.

• విజయ్ దేవరకొండ

33 ఏళ్లు చిన్న విజయ్ దేవరకొండ ఇంకా పెళ్లిచూపులు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. నిజానికి రీసెంట్ టైమ్‌లో ఈ హీరో డిజాస్టర్స్ కారణంగా చాలా నిరాశలో ఉన్నాడు. ఈ సమయంలో పెళ్లి పై అతను ఆసక్తి చూపే ఛాన్సే లేదు.

ఇక సందీప్ కిషన్ 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సాయి ధరమ్ తేజ్ 36, అల్లు శిరీష్ 35 ఏళ్ల వయసులతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా నిలుస్తున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బతుకుతున్న తరుణ్ లాంటి హీరోలు కూడా మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.