ఎన్టీఆర్ ఫ్యాన్స్ వింత డిమాండ్.. తల పట్టుకుంటున్న కొరటాల శివ!

ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “దేవర” సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర అద్భుతంగా పోషించిన తారక్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో దేవర పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత తీసే మూవీ హీరోలకు ఫ్లాప్ ఇస్తుంది. అందుకే తారక్ అభిమానుల్లో ఇప్పుడు కాస్త ఆందోళన నెలకొంది. ఆ కారణంతోనే కొరటాల శివపై వారు ఒత్తిడి చేస్తున్నారు. సినిమా అలా చేయాలి, ఇలా చేయాలి అని కూడా అతనికి సలహాలు ఇస్తున్నారు.

తాజాగా వారు మరొక వింత డిమాండ్ ను కొరటాల శివ ముందు ఉంచారు. నెటిజన్లు ప్రస్తుతం “సిసు” అనే ఇంగ్లీష్ మూవీ లోని ఫైటింగ్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. దేవరలో ఇలాంటి పోరాట సన్నివేశాలను చేర్చాలని ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మెంటల్ మాస్ ఫైట్ బ్లాక్‌లు సినిమాలో యాడ్ చేయాల్సిందేనని ముక్త కంఠంతో సోషల్ మీడియా దద్దరిల్లేలా డిమాండ్స్ వినిపిస్తున్నారు.

ఇంగ్లీష్ మూవీ సిసు కథ చాలా రొటీన్ అని చెప్పవచ్చు. కాకపోతే ఈ సినిమాలో మెంటల్‌ మాస్‌ ఫైట్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే గూస్‌ బమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఈ అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ బ్లాక్‌ల నుంచి కొన్ని కాపీ కొట్టేసి దేవర సినిమాలో చూపించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాపీ కాకపోయినా ఈ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి దేవర ఫైట్ సీక్వెన్స్ లను తీర్చిదిద్దాలని కోరుతున్నారు. మొత్తం మీద కొరటాల తారక్ అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక తల పట్టుకుంటున్నట్లు సన్నిహితుల సమాచారం.