మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మొదటి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

దాదాపు రెండు దశాబ్దాలు నుంచి సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో నటిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా సరే.. వారి ధాటిని తట్టుకొని బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో `భోలా శంకర్‌`, తమిళంలో `జైల‌ర్‌` చిత్రాల్లో నటిస్తోంది.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాలు ఆగ‌స్టులో విడుద‌ల కాబోతున్నాయి. అలాగే బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ ల‌లో నటించింది. ఇవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న తమన్నా.. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అసలు ఊహించలేరు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క ముందు త‌మ‌న్నా.. 2005లో ఓ యాడ్ లో న‌టించింద‌ట‌. అలా మూడు రోజులు షూటింగ్ లో పాల్గొంటే.. త‌మ‌న్నాకు రూ. ల‌క్ష ఇచ్చాడ‌ట‌. అదే ఆమె మొద‌టి రెమ్యున‌రేష‌న్ అట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా స్వ‌యంగా వెల్ల‌డించింది. ఇక ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ మొత్తాన్ని త‌న ఫ్యామిలీకే ఖ‌ర్చు పెట్టాన‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది.