సిద్ధార్ధ్ చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే.. అందుకే కెరీర్ సంకనాకిపోయిందా..?

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సిద్ధార్ధ్ నటించిన టక్కర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమంటూ గాలి తీసేసింది . అట్టర్ ఫ్లాప్ టాక్ అంటూ జనాలు ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు చాలా బాధపడిపోతున్నారు. ఈ సినిమా కోసం సిద్ధార్ధ్ ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారో మనకు బాగా తెలిసిందే. ” బాయ్స్- నువ్వొస్తానంటే నేనొద్దంటానా -బొమ్మరిల్లు”.. సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్ధ్.. చాలా కాలం తర్వాత టైం తీసుకుని తెలుగులో నటించిన సినిమా టక్కర్.

ఈ సినిమా కథ జనాలకు పెద్దగా నచ్చలేదు . అంతేకాదు ఈ కథకు సిద్ధార్థ్ అసలు మ్యాచ్ అవ్వలేదు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . సిద్ధార్ధ్ అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది బొమ్మరిల్లు . ఆ బొమ్మరిల్లు సిద్ధు నే ఇప్పటికి జనాలు లైక్ చేస్తున్నారు.మరి అలాంటి సిద్ధార్ధ్ ఇంత చెత్త కథని ఎలా చూస్ చేసుకున్నాడా ..? అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు.

 

అంతేకాదు సిద్ధార్ధ్ చేసిన ప్రధాన తప్పు ఇదే అని ..కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఆయన కంటెంట్ బేస్డ్ సినిమాలు అంటూ రాంగ్ స్టెప్ తీసుకొని.. తన కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు అని లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు క్రేజ్ సంపాదించుకొని .. ఆ స్థాయి హీరోగా మారిపోయి ఉండేవాడు అని చెప్పుకొస్తున్నారు. దీంతో హీరో సిద్ధార్ధ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!