బాలయ్యనే బురిడి కొట్టించిన అనిల్ రావిపూడి ..నమ్మించి గొంతు కోసేసాడుగా..!?

టాలీవుడ్ నరసిమ్హం గా పాపులర్ రెడ్డి సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్బికె 108 . రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందే అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు . “భగవంత్ కేసరి ” అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు అనిల్ రావిపూడి . అయితే సోషల్ మీడియాలో ఈ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ చర్చలు వైరల్ అవుతున్నాయి .

మరి ముఖ్యంగా అనిల్ రావిపూడి బాలయ్యను నమ్మించి గొంతు కోసాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .దానికి మెయిన్ రీజన్ “భగవంత్ కేసరి” అనే టైటిల్ ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా జనాలకు లీక్ అయిపోవడమే. అంతేకాదు బాలయ్య టైటిల్ అంటే ఓ పవర్ ఫుల్ విధంగా ఉండాలి. పేరులోనే ఆ వైబ్రేషన్స్ ..ఆ పూనకాలు వచ్చేయాలి ..అయితే టైటిల్ లో ఎక్కడా కూడా ఆ మాస్ మాసివ్ అనేది లేదు . టైటిల్ పరంగా కొత్తగా ఉన్నా సరే బాలయ్య అభిమానులకి అది నచ్చడం లేదు. బాలయ్య అంటే ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండాలని అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసే అభిమానులకు అనిల్ రావిపూడి డైరెక్షన్ పై ఎక్కడో తేడా కొడుతుంది .

ఎఫ్2 – ఎఫ్3 లాగే కామెడీగా చేసి ఈ సినిమాను తరికెక్కిస్తున్నావా..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరోపక్క ఎప్పుడు మాస్ సినిమాలేనా బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ కూడా చూడాలి అంటూ మరి కొంతమంది అభిమానులు అనిల్ రావిపూడి ని సపోర్ట్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి బాలయ్య పేర్లు వైరల్ గా మారాయి . ఒక్కటైతే నిజం.. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అయితే టైటిల్ రివిల్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ కూసింత తగ్గాయనే చెప్పాలి. నందమూరి అభిమానులు అలాగనే ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి ఈ గ్యాప్ ను అనిల్ రావిపూడి ఏ విధంగా ఫిల్ చేస్తారో..?