దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ క‌న్య‌లా హ‌నీ రోజ్‌.. వైట్ శారీలో ఏముంది రా బాబు!

అందాల విస్ఫోటనం హ‌నీ రోజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. `వీరసింహారెడ్డి` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది.

ఇందులో బాల‌య్య‌కు మ‌ర‌ద‌లుగానే కాకుండా త‌ల్లి పాత్రను కూడా పోషించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన శృతి హాస‌న్ కంటే హ‌నీ రోజ్ కే ఎక్కువ క్రేజ్ ల‌భించింది. వీర‌సింహారెడ్డి విడుద‌ల త‌ర్వాత హ‌నీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుంద‌ని కూడా అంద‌రూ అనుకున్నారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. హ‌నీ రోజ్ కు తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. అయితే షాపింగ్స్ మాల్స్‌, షోరూమ్స్ ఓపెనింగ్స్ కు మాత్రం హ‌నీ రోజ్ నే ఆహ్వానిస్తున్నారు. సినిమాల క‌న్నా హ‌నీ రోజ్‌ రిబ్బ‌న్ క‌టింగ్సే ఎక్కువ చేస్తోంది.

అలాగే సోష‌ల్ మీడియాల యాక్టివ్ గా ఉంటూ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును అల్లాడిస్తోంది. తాజాగా వైడ్ శారీలో దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ క‌న్య‌లా ద‌ర్శ‌న‌మిచ్చింది.

హ‌నీ రోజ్ తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. అంత అందంగా ఆమె ఎట్రాక్ట్ చేస్తోంది. మ‌రి లేటెందుకు హ‌నీ రోజ్ తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.