ప్రముఖ నటి ప్రగతిని వేధించిన ఆ హీరో.. అతడి టార్చర్ భరించలేక!

ఒంగోలు బ్యూటీ ప్రగతి ఇటీవల కాలంలో దాదాపు ప్రతి హిట్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించడం కామన్ అయిపోయింది. ప్రగతి 2010 నుంచి సంవత్సరానికి 10కి పైగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. హీరో లేదా హీరోయిన్ తల్లిగా లేదంటే బంధువుగా కనిపిస్తూ అలరిస్తోంది. దూకుడు, జులాయి, రేసుగుర్రం, నేను శైలజ, ఛలో, ఎఫ్2, ఓ బేబీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలలోని ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. చాలా వరకు ట్రెడిషనల్ పాత్రలలోనే చేస్తూ ఈ ముద్దుగుమ్మ తెలుగు వారికి బాగా దగ్గరయింది.

అయితే వెండితెరపై సరదా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్లో చిరునవ్వులు చిందించే ప్రగతి నిజజీవితంలో మాత్రం అనేక బాధలను అనుభవించింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో ఆమెకు ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. అయితే వాటిని ఆమె ఏమాత్రం భయపడకుండా బయటపెడుతుంటుంది. తాజాగా కూడా తాను ఫేస్ చేసిన ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నిర్మొహమాటంగా పంచుకుంది. తనను ఒక హీరో కం నిర్మాత బాగా వేధించాడని ఆమె తెలిపింది. ఆ హీరో చాలా ఇబ్బంది పెట్టడం వల్ల ప్రగతి ఒకానొక సమయంలో సినీ పరిశ్రమ వదిలేసి వెళ్లిపోవాలని కూడా అనుకుందట.

అయితే అతని పేరు ఆమె వెల్లడించలేదు. ఎప్పుడైనా అతడి సినిమాలో నటించే అవకాశం వచ్చినా దాన్ని ఆమె వెంటనే చాలా కోపంగా రిజెక్ట్ చేసేదట. కాగా ప్రగతి ఆరోపణలు చేస్తున్న ఆ హీరో కమ్‌ ప్రొడ్యూసర్ ఎవరా అని ప్రస్తుతం అభిమానులు తమలో తామే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఇక చిన్న వయసులో పెళ్లి చేసుకుని తాను పెద్ద తప్పు చేశానని కూడా ప్రగతి చెప్పుకొచ్చింది. భర్త ఎప్పుడూ తనతో ఏకీభవించకుండా మానసిక వేదనకు గురి చేసేవాడని తెలిపింది. అతన్నించి విడిపోయాక తన కూతురిని సొంతంగా పెంచుకుంటున్నానని గర్వంగా చెప్పింది.

ఒకప్పుడు తిండికి కూడా డబ్బులు లేక టెలిఫోన్ బూత్, పిజ్జా షాప్స్ లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చింది. ఇకపోతే ప్రగతి వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ పెడుతుంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫిట్నెస్ గోల్స్ పెంచుతుంది.