బిడ్డ విషయంలో ఉపాసన సంచలన నిర్ణయం.. మెగా ఫ్యామిలీ కి కొత్త తలనొప్పులు స్టార్ట్..!?

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ప్రజెంట్ ఉన్న హీరోలు కూడా అప్పుడే తమ వారసులను ఇండస్ట్రీలోకి రప్పించడానికి తెగ ట్రై చేస్తున్నారు. కొంతమంది వారసులైతే ఆల్రెడీ ఎంట్రీ కూడా ఇచ్చేశారు . అయితే ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు . ఈ హీరో తర్వాత ఆ హీరో కొడుకు ..ఆ హీరో కొడుకు కొడుకు అంటూ ప్లేస్లను కన్ఫామ్ చేస్తూ ఉంటారు . అయితే ఆ విషయంలో మెగా ఫాన్స్ కూసింత అసహనం పడాల్సిన వార్త ఇది అని చెప్పాలి .

మనకు తెలిసిందే మెగా కోడలు పిల్ల ఉపాసన ప్రెగ్నెంట్ . ప్రెసెంట్ ఎనిమిదవ నెల రన్ అవుతుంది. మరికొన్ని వారాల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి..? లేదా బాబుకి ..?జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే ఉపాసన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొదటి నుంచి ఉపాసన చాలా కమిట్మెంట్ గల వ్యక్తి అని అందరికీ తెలిసిందే. తాను అనుకున్నది అనుకున్నట్లు సాధించే అమ్మాయి .

అయితే సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని ఉపాసన తన కొడుకును గాని కూతుర్ని గాని ఇండస్ట్రీ వైపు మళ్ళించే అవకాశం లేదు అంటూ చెప్పేసిందట. వాళ్లను కచ్చితంగా డాక్టర్లు గానే తీర్చిదిద్దాలి అని ఉపాసన ఇప్పటినుంచే ప్లాన్ చేస్తుందట . ఇదే విషయాన్ని మామ మెగాస్టార్ చిరంజీవికి .. భర్త రామ్ చరణ్ కి సైతం క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని రామ్ చరణ్ తర్వాత ఆయన వారసుడిగా ఆయన కొడుకు రంగంలోకి దిగతాడు అని ఆశపెట్టుకున్న మెగా ఫ్యాన్స్ కు ఇది చేదువార్తగా మిగిలిపోయింది..!!